భారతదేశం, జనవరి 30 -- సాంకేతిక నగరంగా పేరుగాంచిన బెంగుళూరులో ఒక పక్క సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోలాహలం కనిపిస్తుంటే, మరోపక్క బతుకు బండిని లాగడానికి సగటు మనిషి పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సుమారు ఏడాదిన్నర పాటు నిరుద్యోగంతో కుదేలై, చివరకు క్యాబ్ డ్రైవర్‌గా మారిన ఒక వ్యక్తి తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

రెడ్డిట్ వేదికగా ఆ వ్యక్తి తన గోడును వెళ్లగక్కారు. "దాదాపు 1.5 ఏళ్ల పాటు నిరుద్యోగిగా ఉన్నాను. మధ్యలో ఒక వ్యాపారం మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాను. లోన్లు, క్రెడిట్ కార్డు అప్పులు కొండలా పెరిగిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. దీంతో గత నెలలో రోజుకు రూ. 1500 అద్దెకు ఒక కారు తీసుకుని క్యాబ్ నడపడం ప్రారంభించాను" అని ఆయన తన గతాన్ని గుర్తు చేసుకున్నారు.

ఉబర్, రాపిడో వంటి ప్లాట్‌ఫామ...