భారతదేశం, జనవరి 9 -- మలయాళ నటి అన్ను ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'మెమరీ ప్లస్' (Memory Plus). 2024 ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ మలయాళ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మనోరమ మ్యాక్స్ లో జనవరి 9 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
ఏడాదిన్నర కిందటే థియేటర్లలో రిలీజైన ఈ మెమొరీ ప్లస్ మూవీలో అన్ను ఆంటోనీ, అనీష్ జి మీనన్, స్మిను సిజో ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రేమ, బాధ, గాయాలు, తమను తాము తెలుసుకునేందుకు ఓ తల్లీకూతుళ్లు చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 50 లక్షలలోపే వసూలు చేసింది. ఈ మెమొరీ ప్లస్ సినిమాను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.