భారతదేశం, జనవరి 4 -- టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మిగులు జలాలపై మాట్లాడారు. ప్రతి సంవత్సరం 2,000 నుండి 3,000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తుందని, మిగులు జలాల వినియోగంపై వివాదాలు అనవసరమని అన్నారు. అవి ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయని పేర్కొన్నారు.

అంతర్రాష్ట్ర జలాల పంపిణీపై బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు. విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సోదరుల్లాగా కలిసి ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ నీటిని దొంగిలిస్తోంది అని ఆరోపిస్తూ సెంటిమెంట్ సృష్టించడానికి పదే పదే చేసిన ప్రయత్నాలను ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టుపై తీవ్ర వ్యతిరేకతను ప్రశ్నించారు. ఇంత పెద్ద మొత్తంలో నీరు వృథాగా పోతున్నప్పుడు అభ్య...