భారతదేశం, మే 12 -- ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నూరు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో జీ.వో నెంబర్ 3 తెచ్చామని సిఎం చంద్రబాబు గుర్తు చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెంబర్ 3 పునరుద్దరణకు తీసుకావల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే... 2020లో రద్దయిన జీ.వో నెంబర్ 3 పునరుద్దరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.

సోమవారం సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. ఈ రివ్యూలో గిరిజన సంక్షేమ శాఖ, న్యాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

1986లో వచ...