భారతదేశం, జనవరి 10 -- సినీ తారల్లో ఎంతోమంది బరువు పెరగడం, తగ్గడం వంటివి చేశారు. కానీ, ఏకంగా 40 కిలోల బరువు తగ్గి హాట్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది ఓ హీరోయిన్. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ భూమి పెడ్నేకర్. అయితే, భూమి పెడ్నేకర్ అనగానే 'దమ్ లగా కే హైషా' సినిమా గుర్తొస్తుంది.

'దమ్ లగా కే హైషా' మూవీ కోసం భారీగా బరువు పెరిగిన భూమి పెడ్నేకర్ ఆ తర్వాత కేవలం కొద్ది కాలంలోనే 30 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు బరువు తగ్గుతున్నారంటే చాలు.. వారు 'ఓజెంపిక్' (Ozempic) వంటి ఇంజెక్షన్లు వాడుతున్నారని ప్రచారం జరగడం సాధారణమైపోయింది.

భూమి పెడ్నేకర్ కూడా అలాంటి ఇంజక్షన్స్ వాడిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి వస్తున్న రూమర్లపై భూమి పెడ్నేకర్ చాలా ఘాటుగా స్...