భారతదేశం, ఏప్రిల్ 25 -- ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీ భవిష్యత్తును నిర్దేశిస్తుందని, దానిని ప్రభుత్వం అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఏమి చేయాలనే కార్యాచరణపై ఏపీ సచివాలయంలో రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించారు.

ఏపీలో పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన పౌర సేవల్ని అందించడం మీద రెండు రోజుల వర్క్‌షాప్‌ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఎలాంటి పురోగతి సాధించవచ్చో అధికారులకు వివరించారు. శాఖల వారీగా ఏఐ భాగస్వామ్యంతో ఏమి చేయొచ్చో వివిధ పద్ధతుల్లో వివరించారు.

ఇందులో పాల్గొన్న వారికి టెక్నాలజీ గురించి ఎంత వరకు అర్థమైందో కానీ వర్క్‌షాప్‌పై రెండు రోజులుగా విడుదల చేసిన ప్రకటనల్ని మాత్రం ఏఐ టూల్స్‌తో తయారు చేసినట్టు అందరికీ అర్థమై పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పా...