భారతదేశం, జూన్ 21 -- బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! భారత మార్కెట్​లో ఇటీవలే ఒక కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది ఐటెల్​. దీని పేరు ఐటెల్​ జెనో. ఇదొక 5జీ గ్యాడ్జెట్​. రోజువారీ వినియోగదారుల కోసం అవసరమైన ఫీచర్లను అందించడం దీని లక్ష్యం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఐ-ఆధారిత కార్యాచరణలను కలిగి ఉంది. ఈ నేపత్యంలో ఈ మొబైల్​కి చెందిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

బ్రాండ్ ప్రకారం.. ఐటెల్​ జెనో 5G 6.67-ఇంచ్​ హెచ్​డీ+ పంచ్-హోల్ డిస్‌ప్లేతో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 240హెచ్​జెడ్​ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఇది 7.8 ఎంఎం స్లిమ్​ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఐపీ54 రేట...