భారతదేశం, డిసెంబర్ 30 -- యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఎంతో కష్టం, సృజనాత్మకత ఉండాలని మనం అనుకుంటాం. కానీ, కృత్రిమ మేధ (AI) సాయంతో ఎటువంటి లోతైన కథ లేదా డైలాగులు లేకుండానే కోట్లు సంపాదించవచ్చని నిరూపిస్తోంది ఒక భారతీయ యూట్యూబ్ ఛానల్. 'బందర్ అప్నా దోస్త్' (Bandar Apna Dost) పేరుతో నడుస్తున్న ఈ ఛానల్, ఏటా ఏకంగా 38 కోట్ల రూపాయల వరకు ఆర్జిస్తోందని తాజాగా ఒక అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది.

వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫారమ్ 'క్యాప్‌వింగ్' (Kapwing) నిర్వహించిన ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం.. తక్కువ శ్రమతో, కేవలం AI పరికరాలను ఉపయోగించి రూపొందించిన ఈ ఛానల్ వీడియోలకు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. కేవలం కొన్ని నెలల క్రితమే ప్రారంభమైనప్పటికీ, ఈ ఛానల్ ఏడాదికి సుమారు 4.25 మిలియన్ డాలర్లు (రూ. 35 నుండి 38 కోట్లు) సంపాదిస్తున్నట్లు అంచనా. దీన్ని టె...