భారతదేశం, జనవరి 27 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందర్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి తయారుచేసిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించినట్టుగా పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఏఐ మార్ఫింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన సినిమాలోత తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని తెలిపాడు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన పూర్తి నిడివి గల చిత్రాన్ని అనధికారికంగా సృష్టించడం ద్వారా తన వ్యక్తిత్వం, ప్రచారం, గోప్యతా హక్కులను పెద్ద ఎత్తున ఉల్లంఘించారని ఆరోపిస్తూ అకీరా నందన్ పిటిషన్‌లో కోర్టుకు వివరించాడు. ఏఐ లవ్ స్టోరీ అనే ఏఐ రూపొందించిన సినిమాను యూట్యూబ్‌లో బహుళ వెర్షన్లలో అప్‌లోడ్ చేశారని తెలిపాడు. జనవరి 22, 2026 నాటికి తెలుగు భాషా వెర్షన్ 1,109,255 వీక్షణ...