భారతదేశం, ఫిబ్రవరి 13 -- సినిమా రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. కొందరు దీనిని ముప్పుగా భావిస్తుంటే, మరికొందరు మాత్రం అద్భుతమైన అవకాశంగా చూస్తున్నారు. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', '3 ఇడియట్స్', 'పీకే' వంటి అద్భుత చిత్రాలను అందించిన హిందీ దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ రెండో కోవకు చెందిన వారు. ఏఐ సాయంతో ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

వెరైటీ ఇండియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ హిరానీ తన సరికొత్త ఆలోచనలను పంచుకున్నారు. "ఏఐ అనేది నిజంగా ఒక గొప్ప సాధనం. మనం దానితో త్వరగా స్నేహం చేయాలి. సినిమా మొత్తం ఏఐతోనే చేయాలని రూలేమీ లేదు, కానీ గతంలో మనం చేయలేకపోయిన పనులను దీనితో సులభంగా, తక్కువ ఖర్చుతో చేయవచ్చు" అని రాజ్‌కుమార్ హిరానీ వివరించారు.

ప్రస్తుతం ఒక మంచి కథ తన ద...