Hyderabad, ఆగస్టు 7 -- తన సినిమాలలో భవిష్యత్తును చూపించే దర్శకుడు జేమ్స్ కామెరాన్. ఇప్పుడతడు మరోసారి ప్రపంచానికి హెచ్చరిక జారీ చేశాడు. అయితే, ఈసారి అది కల్పితం కాదు. తను సినిమాగా తీయాలనుకుంటున్న 'ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా' అనే పుస్తకాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు.. అతడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఉన్న ప్రమాదాల గురించి, ముఖ్యంగా ఆయుధ వ్యవస్థలతో కలిపినప్పుడు వచ్చే ముప్పు గురించి ఆందోళన వ్యక్తం చేశాడు.

'అవతార్: ఫైర్ అండ్ యాష్' దర్శకుడు అయిన జేమ్స్ కామెరాన్.. రోలింగ్ స్టోన్‌తో మాట్లాడుతూ ఏఐని సైనిక వ్యవస్థలు.. ముఖ్యంగా అణు రక్షణతో కలపడం వల్ల వినాశకరమైన పరిణామాలు సంభవించవచ్చని చెప్పాడు. ఏఐ ఆధారిత వినాశకరమైన పరిస్థితులను చూపించే తన ఐకానిక్ సినిమా ఫ్రాంఛైజీని ప్రస్తావిస్తూ.. "టెర్మినేటర్ తరహా ప్రపంచ వినాశనం ముప్పు ఇంకా ఉందని నేను అనుకుంటున్...