భారతదేశం, నవంబర్ 26 -- ఏఐతో ప్రమాదం, ఈ టెక్నాలజీ ఉపయోగించి చెడుగా మారుస్తున్న ఫొటోలపై మహానటి కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన రాబోయే చిత్రం 'రివాల్వర్ రీటా' ప్రచారంలో భాగంగా ఏఐ దుర్వినియోగం గురించి మాట్లాడింది. సుధీర్ శ్రీనివాసన్‌తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె ఈ విషయం గురించి వివరంగా చర్చించింది. మహిళా నటీమణుల చిత్రాలు ఇప్పటికే మార్ఫింగ్ చేస్తూనే ఉన్నారని, ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని ఆమె చెప్పింది.

కీర్తి సురేష్ మాట్లాడుతూ ఏఐ వల్ల హీరోయిన్లు పెద్ద ముప్పును ఎదుర్కుంటున్నారని తెలిపింది. "మీరు గమనిస్తే, మార్ఫింగ్ అనేది హీరోయిన్లు మొదటి నుంచీ ఎదుర్కొంటున్నదే. ఇవన్నీ అప్పటికే ఉన్నాయి. కానీ ఏఐతో సమస్య ఏమిటంటే? అది చాలా వాస్తవంగా కనిపిస్తుంది" అని కీర్తి అసహనం వ్యక్తం చేసింది. మార్ఫింగ్ చేసిన తన ఫొటోలు చూసి నమ్మలేకపోయినట్లు కీర్తి సురేష...