భారతదేశం, నవంబర్ 9 -- ఫ్యాన్స్ కు రామ్ చరణ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. శనివారం (నవంబర్ 8) రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీలో పాల్గొన్నాడు. జాన్వీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి వచ్చాడు. రెహమాన్ క్లాసిక్ పాటలను వినడానికి వచ్చిన అభిమానులు.. రామ్, జాన్వీ వేదికపైకి రావడంతో ఆశ్చర్యపోయారు.

ఏఆర్ రెహమాన్ కచేరీలో రామ్ చరణ్ వేదికపైకి వచ్చి ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడాడు. "చికిరి పాట అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతంలో భాగం కావడం నా చిన్ననాటి కల. అది కూడా నాకు ఇష్టమైన 'పెద్ది' సినిమాతో కావడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదని నేను భావిస్తున్నా" అని రామ్ చరణ్ అన్నాడు. ఆ మాటలకు ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.

బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో స్పీచ్ తో అదరగొట్టింది."ఈ...