Hyderabad, మే 4 -- కుడకలు లేదా ఎండు కొబ్బరిని ఇప్పటి వరకూ వంటల్లో వేసుకునే ఆహార పదార్థంగా మాత్రమే వాడుతున్నాం కదా. వాస్తవానికి దీనిని రుచి కోసం మాత్రమే కాదట. ఇది తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఖీర్‌లో వేయడానికి లేదా చట్నీ చేయడానికి ఎక్కువగా వినియోగిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో చికెన్, దొండకాయ, బెండకాయ, కాకరకాయ లాంటి కూరల్లో ఎక్స్‌ట్రా ఐటెంగా వేసుకుని కూడా ఎంజాయ్ చేస్తాం. ఇలా తింటే టేస్టీగానూ, హెల్తీగానూ ఉంటాం. దీనిని కేవలం వంటల్లో మాత్రమే కాకుండా, స్నాక్‌గా కూడా తినొచ్చట.

సాధారణంగా ఎక్కువ శాతం మంది కొబ్బరి ఎండుదైనా, పచ్చిదైనా ఒక ముక్క నోట్లో వేసుకోనిదే ఊరుకోరు. ఎందుకంటే, కొబ్బరిని ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ప్రతిసారీ ఎండుకొబ్బరిని తినడం అనేది చాలా మంచిదట. అయితే దీనిని కొబ్బరి తు...