భారతదేశం, మే 13 -- ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడ వైమానిక దళ సిబ్బందితో మమేకమయ్యారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఆదంపూర్ లోని ఎస్ 400 గగనతల రక్షణ వ్యవస్థ నేపథ్యంలో సైనికులకు సెల్యూట్ చేస్తూ దిగిన ఫొటోను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేశారు.

పహల్గామ్ లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ భారీగా నష్టపోయింది. అయితే, తాము చేసిన దాడుల్లో భారత్ లోని ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం అయిందని పాకిస్తాన్ ప్రచారం చేపట్టింది. పాకిస్థాన్ కు చెందిన జేఎఫ్ -17 జెట్ల నుంచి ప్రయోగించిన హైపర్ సోనిక్ క్షిపణులు ఆదంపూర్ లోని ఎస్ -400 వ్యవస్థను ధ్వంసం చేశాయని పాక్, చైనాలు ప్రచారం చేశాయి. అయితే, అది వాస్తవం కాదని, పాకిస్తాన్ అబద్ధాలను ప్రచారం చేస్తోందన...