Telangana, సెప్టెంబర్ 5 -- ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. ఇకనుంచి ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పనులు జరగాలని చెప్పారు. 2027 డిసెంబరు 9 లోగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి. తెలంగాణ ప్రజలకు అంకితమివ్వాలని గడువు నిర్దేశించారు. గడువు లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకే కాకుండా తెలంగాణకు అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచస్థాయి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పక్కడ్బందీగా పటిష్టవంతమైన రక్షణ చర్యలతో ముందుకు సాగాలని చెప్పారు.

ఎస్ఎల్బీసీ (SLBC) పనుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి ర...