భారతదేశం, ఏప్రిల్ 17 -- భారత్ ఎన్​సీఏపీ క్రాష్ టెస్ట్ ప్రోగ్రామ్ కింద 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన తాజా మోడల్ కియా సైరోస్ ఎస్​యూవీ. ఫలితంగా భారతదేశంలో సబ్-కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్ మరింత పోటీగా మారింది. ఇది స్కోడా కైలాక్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓల సరసన చేరింది. ఇవి కూడా క్రాష్​ టెస్ట్​లో టాప్​ రేటింగ్స్​ పొందాయి. ఈ నేపథ్యంలో సేఫ్టీ పరంగా ఏ ఎస్​యూవీ బెస్ట్​? ఇక్కడ తెలుసుకుందాము..

అడల్ట్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 32 పాయింట్లకు గాను 30.21 పాయింట్లు, చైల్డ్ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 49కి 44.42 పాయింట్లు సాధించింది కియా సైరోస్​ ఎస్​యూవీ. హెచ్​టీఎక్స్ + పెట్రోల్-డీసీటీ, హెచ్​టీకే (ఓ) పెట్రోల్-ఎంటీ వర్షెన్లలో పరీక్షించిన ఈ ఎస్​యూవీ ఫ్రంటల్ ఆఫ్​సెట్ పరీక్షలో 14.21/16, సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో పూర్తి 16/16 స్కోరు...