భారతదేశం, ఏప్రిల్ 25 -- రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 25 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి ప్రకటన విడుదల చేశారు. సొసైటీ పరిధిలో మొత్తం 239 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

అర్హులైన విద్యార్థులు https://tgswreis.telangana.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి పాలైన విద్యార్థులకు దీంట్లో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలు మించకూడదు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులు అర్హులు. దరఖాస్తు చేసె సమయంలో అడిగిన అన్ని వివరాలు సమర్పించాలి. లేకపోతే రిజెక్ట్ చేస...