భారతదేశం, జనవరి 27 -- బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం అంటే గౌరవంతో పాటు మంచి వేతనం ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే, కెరీర్ ప్రారంభంలోనే ఒక బ్యాంకు అధికారి ఎంత సంపాదిస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ)గా పనిచేస్తున్న శ్వేతా ఉప్పల్ అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా తన నెలవారీ జీతం వివరాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.

@bankerstrick అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా శ్వేత ఈ వివరాలను వెల్లడించారు. 2022లో ఐబీపీఎస్ పరీక్ష రాసి ఎస్బీఐలో పీఓగా చేరిన ఆమెకు ప్రస్తుతం రెండున్నర ఏళ్ల అనుభవం ఉంది. ఈ తక్కువ కాలంలోనే ఆమె ఐదు ఇంక్రిమెంట్లు సాధించారు! ప్రస్తుతం ఇన్​-హ్యాండ్​ శాలరీ నెలకు సుమారు రూ. 95,000 వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

శ్వేత వెల్లడి...