భారతదేశం, ఏప్రిల్ 22 -- ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ 2025 సవరించిన తాత్కాలిక ఖాళీల జాబితా విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), అస్సాం రైఫిల్స్ లో ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ లోని రైఫిల్మన్ (జీడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయిల్లో మొదట 39,481 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా, ఆ ఖాళీల సంఖ్యను సవరించారు. సవరించిన తాత్కాలిక ఖాళీల జాబితా ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), అస్సాం రైఫిల్స్ లో ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ లోని రైఫిల్మన్ (జీడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయిల్లో 53,690 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 25 వరకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), అస్సాం రైఫిల్స్ ల...