భారతదేశం, ఆగస్టు 4 -- అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో ఎస్ఎస్ఎంబీ 29 క్రేజ్ వేరే లెవల్ లో ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి మూవీ ఇది. ఫారెస్ట్ అడ్వెంచరస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ కోసం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హైదరాబాద్ కు వచ్చింది.

భర్త నిక్ జోనాస్‌తో కలిసి ఫ్యామిలీ వెకేషన్ గడిపిన తర్వాత ప్రియాంక చోప్రా తిరిగి యాక్టింగ్ కు రెడీ అవుతోంది. ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ కోసం ఆమె సోమవారం (ఆగస్టు 4) హైదరాబాద్ లో అడుగుపెట్టింది. తన కుమార్తె మాల్తీ మేరీని కూడా వెంట తెచ్చుకుంది. మాల్తీ కారు కిటికీలోంచి పచ్చని చెట్లను చూస్తున్న ఫోటోను ప్రియాంక ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ప్రియాంక తన కుమార్తె మాల్తీ పింక్ ట్యూల్ దుస్తులు, తెల్లటి లెగ్గింగ్స్‌లో...