భారతదేశం, మే 24 -- బీఆర్ఎస్‌లో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందని.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తమ నాయకుడికి ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చన్న కేటీఆర్‌.. అంతర్గత విషయాలు బయట మాట్లాడకపోతే మంచిదని హితవు పలికారు. పార్టీలో అందరం కార్యకర్తలమే.. అందరూ సమానమే అని స్పష్టం చేశారు. తమ పార్టీలో రేవంత్‌ కోవర్టులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్.

'పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చు. అంతర్గత విషయాలు.. అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారు' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఇటీవల కేసీఆర్‌కు కవిత లేఖ రాశారు. వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే.. లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాల...