భారతదేశం, డిసెంబర్ 14 -- బిగ్ బాస్ అంటే ఊహించని ఎలిమినేషన్స్, అనుకోని టాస్క్‌లు, సపోర్టింగ్‌లు, గొడవలు, రొమాన్స్‌. ఈ వారం కూడా ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకోనుంది. ఈపాటికే శనివారం అంటే డిసెంబర్ 13 నాటి ఎపిసోడ్‌లో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు.

ఎలిమినేషన్ అనంతరం హీరో శివాజీ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సుమన్ శెట్టి. ఈ బజ్ ఇంటర్వ్యూలో శివాజీ వర్సెస్ సుమన్ శెట్టి అన్నట్లుగా ఒకరికొకరు పంచ్‌లు ఇచ్చుకున్నారు. ముందుగా సుమన్ శెట్టి ఇంటర్వ్యూలోకి హాజరయ్యాడు. రాగానే సుమన్ శెట్టితో ప్రమాణం చేయించాడు హోస్ట్ శివాజీ.

"అధ్యక్షా.. బజ్‌లో ఏ క్వశ్చన్ అడిగినా.. భరణి గారి నుంచి ఏ లైఫ్‌లైన్ తీసుకోనని.. అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను" అని శివాజీ ప్రమాణం చేయ...