Hyderabad, ఆగస్టు 13 -- ఈ గురువారం అంటే ఆగస్టు 14న బాక్సాఫీస్ వద్ద భారీ పోరు జరగనుంది. రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'కూలీ'.. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ విడుదలకు ముందు టాలీవుడ్ నటుడు నాని ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. బాక్సాఫీస్ పరంగా ఏ సినిమా గెలుస్తుందనేది ముఖ్యం కాదని, చివరికి "సినిమా గెలవాలి" అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

బాక్సాఫీస్ దగ్గర కూలీ, వార్ 2 సినిమాల వార్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ నాని చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. బుధవారం (ఆగస్టు 13) సాయంత్రం నాని తన ఎక్స్ ఖాతాలో ఇలా రాశాడు. "రేపు తారక్ (జూనియర్ ఎన్టీఆర్) ఎప్పటిలాగే హృతిక్ సర్‌తో కలిసి అదరగొడతాడని నాకు నమ్మకం ఉంది. రేపు రజినీ సర...