భారతదేశం, మే 18 -- కలేకూరి ప్రసాద్.. ఓ మల్లె పువ్వు. పేదల ఇండ్లల్లో పరిమళించే మట్టి వాసన. కన్నీళ్లకు బదులు.. దళితులు చెప్పుకునే ఓ కథ. ఆయన చనిపోయి పుష్కర కాలం దాటింది. అయినా.. ప్రసాద్ అక్షర పరిమళాలు ఇంకా వెదజల్లుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఎవరీ కలేకూరి ప్రసాద్.. ఆయన ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారు. ఇప్పుడు తెలుసుకుందాం.

1.కలేకూరి ప్రసాద్ 1964 అక్టోబర్ 25న జన్మించారు. ఆయన కృష్ణా జిల్లాలోని కంచికచెర్లలో పుట్టారు. ప్రసాద్ తల్లిదండ్రులు లలితా సరోజిని, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులే.

2.ప్రసాద్ తెలుగు కవి. సినీ గీత రచయిత. సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు. దళిత ఉద్యమకారుడు. ప్రసాద్ 'యువక' అనే కలం పేరుతో కవితలు రాశారు.

3.ప్రసాద్ జననాట్య మండలి, విప్లవ రచయితల సంఘంలో పనిచేశారు. పీపుల్స్ వార్ పార...