భారతదేశం, నవంబర్ 18 -- కొంతకాలంగా మావోయిస్టు పార్టీ కోలుకోలేని ఎదురుదెబ్బలు తగుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతల మరణం ఒకవైపు ఉద్యమాన్ని బలహీనపరుస్తుంటే.. మరోవైపు లొంగుబాట్లు కూడా జరిగాయి. దీంతో పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. మావోయిస్టు అగ్రనేతలైన ఆశన్న, మల్లోజుల వేణుగోపాల్‌లాంటి కీలక నేతలు లొంగిపోయారు. తర్వాత ఎక్కడా చూసినా హిడ్మా పేరు ఎక్కువగా వినిపించింది. ఏదైనా ఉంటే హిడ్మా చూసుకుంటాడులే అన్నట్టుగా మారిపోయింది. కానీ తాజాగా హిడ్మా కూడా ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన ఎక్కడ నుంచి వచ్చారు?

1981లో సుక్మాలో పూర్వటి గ్రామంలో జన్మించిన హిడ్మా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌కు నాయకత్వం వహించాడు. సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడయ్యాడు. బస్తర్ ప్రాంతం నుండి కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు ఆయన. మురియా...