భారతదేశం, జనవరి 27 -- 'జవాన్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అట్లీ, నటి దీపికా పదుకోన్ మరోసారి జతకట్టనున్నారు. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రాబోయే 'AA22xA6' అనే తెలుగు సినిమాలో దీపిక నటించనుంది. ఇండియా టుడేతో మాట్లాడుతూ అట్లీ ఈ ప్రాజెక్ట్ గురించి, దీపికా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మూవీ ఎవరి ఊహకు అందని రీతిలో అత్యంత భారీగా ఉండబోతున్నట్లు చెప్పాడు.

అల్లు అర్జున్, దీపికా పదుకోన్ మూవీ గురించి డైరెక్టర్ అట్లీ మాట్లాడాడు. తాము ప్రేక్షకుల కోసం చాలా భారీ ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నామని చెప్పాడు.

"ప్రతి రోజూ మేము ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొంటున్నాం. సినిమా గురించి వినడానికి అందరూ ఎంత ఆశగా ఉన్నారో నాకు తెలుసు. నిజాయితీగా చెప్పాలంటే ప్రేక్షకుల కంటే ఎక్కువగా నేను వారికి అన్నీ చెప్పడానికి ఎదురుచూస్తున్నాను. దీనిక...