భారతదేశం, జూలై 26 -- దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తన తమిళ చిత్రం కూలీ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన కూలీ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలోనే లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఓ ఫీమేల్ సూపర్ హీరో క్యారెక్టర్ ఉంటుందని పేర్కొన్నారు.

లోకేష్ కనగరాజ్ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)ను సృష్టించారు. ఇది తమిళ సినిమాలో ఒక కొత్త ప్రయత్నం. ఈ యూనివర్స్‌లో ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో అనే మూడు సినిమాలు రిలీజ్ చేశారు. ఆయన అభిమానులు తదుపరి భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎల్సీయూలో పవర్ ఫుల్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లు తక్కువగానే ఉన్నాయి. లోకేష్ ఇటీవల కూలీ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో బలమైన ...