Hyderabad, అక్టోబర్ 7 -- అట్లతద్ది పండుగను ఆడపడుచులు, పెళ్లయిన స్త్రీలు ఉపవాసం ఉండి అట్లతద్ది నోము చేసుకుంటారు. సాయంత్రం అట్లను ముత్తయిదువుకి ఇచ్చి, చంద్రుని చూసి, అప్పుడు ఉపవాసాన్ని విరమిస్తారు. ఈ ఏడాది అట్లతద్ది అక్టోబర్‌ 9, గురువారం నాడు వచ్చింది. స్త్రీలు చేసే నోముల్లో అట్లతద్ది నోము కూడా ఒకటి.

అట్లతద్ది పండుగ అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది అట్లు. 11 అట్లు, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి వాయినం ఇస్తారు. అదే విధంగా 11 అట్లు, బెల్లం ముక్క నోము చేసుకున్న వారు చంద్రుని దర్శనం అయిన తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తారు. అట్లతద్దినాడు గోరింటాకు పెట్టుకోవడం, ఉయ్యాలలూగడం కూడా ఆనవాయితీ.

దక్షిణాది రాష్ట్రాలలో అట్లతద్ది పండుగ జరుపుకుంటే, ఉత్తరాది రాష్ట్రాలలో కర్వా చౌత్‌గా జరుపుకుంటారు. అట్లతద్ది నాడు పెళ్లి కాని వారు మంచి జీవిత భాగస్వామి రావాలని అట్ల...