Andhrapradesh,telangana, ఆగస్టు 31 -- పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి సగటున 1.5, 5.8 కి.మీ ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. అంతేకాకుండా.. ఎల్లుండి వాయువ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.

ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు నాలుగు రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.

ఇక తెలంగాణలో కూడా మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ...