భారతదేశం, మే 9 -- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తుస్తోంద‌ని.. వైసీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నార‌ని ఆరోపించారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండద‌న్న సజ్జల.. రేపు తాము అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుందంటూ ప్రశ్నించారు. గుంటూరు సీఐడి కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి విచారణ జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

'టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారు. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చా. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చా. ప్రజాస్వామ్యంలో పట్టాభి లాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసు. దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో ...