భారతదేశం, ఆగస్టు 1 -- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సఖీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 1 లక్ష మంది మహిళా పాలసీదారులను నియమించడం లక్ష్యం. 10వ తరగతి పూర్తి చేసిన మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ మహిళలు నెలవారీ ఆదాయం సంపాదించడానికి ఇది ఒక ప్రత్యేక అవకాశంగా చెప్పవచ్చు. ఇది వారికి స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. బీమా గురించి అవగాహన కల్పి్స్తుంది.

మహిళలను ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించి శిక్షణ ఇస్తారు. రూ.7,000 స్టైఫండ్ కూడా పొందుతారు. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏ పత్రాలు అవసరం? శిక్షణ ఎలా ఉంటుంది? అనే దాని గురించి తెలుసుకుందాం.

ఎల్ఐసీ బీమా సఖీ పథకం అనేది మహిళా సాధికారత చొరవ. దీని లక్ష్యం మహిళలను ఎల్ఐసీ ఏజెంట్లుగా నియమించడం, శిక్షణ ఇవ్వడం. ఇది వారికి ఆదాయాన్ని సంపాదించడానికి, బీమా గురించి అ...