Telangana, జూన్ 17 -- ఎల్ఆర్ఎస్ (ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ) దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. గడువు ముగిసిన నేపథ్యంలో.. మరోసారి గడువు పొడిగించింది. జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించి. 25 శాతం రాయితీని పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జూన్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించిన వారికి మాత్రమే 25 శాతం రాయితీ అవకాశం ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత అలాంటి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ పొందవచ్చు.

ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా అనధికార లే అవు...