Hyderabad, ఏప్రిల్ 25 -- ఎలిఫేంట్ వాక్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఏనుగులు నడిచే పద్దతి చూశారా? వాటి నడకే ఎలిఫేంట్ వాక్ పేరుతో వ్యాయామంగా మారింది. ఏనుగు నడక పద్దతిని ప్రతిరోజూ పావు గంట పాటూ వ్యాయామంగా చేస్తే చాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పొట్ట కొవ్వు త్వరగా కరుగుతుంది.

నిశ్చల జీవనశైలి, పేలవమైన ఆహారపు అలవాట్లు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ ఊబకాయులుగా మారుస్తున్నాయి. మితిమీరిన ఊబకాయం వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే కాదు, క్రమంగా అనేక వ్యాధులకు గురిచేస్తుంది. ముఖ్యంగా వేలాడే పొట్టతో ఇబ్బంది పడేవారు ఎక్కువ. పొట్ట కొవ్వును వదిలించుకోవడం ద్వారా మీ శరీర భంగిమను సరిదిద్దాలనుకుంటే, ఏనుగు నడకను దినచర్యలో భాగం చేసుకోండి. ఇది ఒక సింపుల్ వ్యాయామం.

ఎలిఫెంట్ వాక్ అనేది ఏనుగులాగా నడిచే పద్దతి. ముందుకు వంగి ఫోటోలో చూపించినట్టు చేతులను గాలిలోనే వేలాడదీ...