భారతదేశం, జనవరి 19 -- భారతదేశంలో హైబ్రిడ్ కార్లతో (ఇన్నోవా హైక్రాస్, హైరైడర్) సంచలనం సృష్టిస్తున్న జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం 'టయోటా', ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'అర్బన్ క్రూయిజర్ ఈవీ'ని జనవరి 20న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కారు లాంచ్‌తో హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, మారుతి సుజుకి ఈ-విటారా వంటి కార్లకు టయోటా గట్టి పోటీ ఇవ్వనుంది.

ఇటీవల విడుదలైన టీజర్ వీడియోను బట్టి చూస్తే, ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ టయోటా ప్రసిద్ధ మోడల్ 'కామ్రీ' (Camry) నుండి స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా దీని ఫ్రంట్ డిజైన్, సింగిల్-స్ట్రిప్ డీఆర్‌ఎల్స్‌తో కూడిన ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. మారుతి సుజుకి ఈ-...