భారతదేశం, మార్చి 9 -- భారతీయ వినియోగదారులలో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకు డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఫిబ్రవరి 2025లో టాటా మోటార్స్ ఈ సెగ్మెంట్ అమ్మకాలలో టాప్‌లో ఉంది. ఈ కాలంలో టాటా మోటార్స్ మొత్తం 3,825 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. అయితే టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు చూసుకుంటే మాత్రం 24.21 శాతం క్షీణించాయి. ఈ కాలంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ వాటా 42.65 శాతంగా ఉంది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన 10 కంపెనీల ఎలక్ట్రిక్ కార్ల గురించి తెలుసుకుందాం.

అమ్మకాల్లో ఎంజీ మోటార్ రెండో స్థానంలో నిలిచింది. ఈ కాలంలో ఎంజీ మోటార్స్ మొత్తం 3,270 యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాల జాబితాలో హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది. హ్యుందాయ్ మొత్తం 738 యూనిట్లను అమ్మకాలు చేసింది. ఈ అమ్మకాల్లో మహీంద్రా నాలుగో స్థానంలో నిలిచింది....