భారతదేశం, డిసెంబర్ 4 -- ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌లో పర్యటించారు. ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో రూ. 260.45 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ఏడాదిలోపు ప్రారంభమవుతాయని రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్థానిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో సమగ్ర సౌకర్యాలను కలిగి ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

'ఎర్ర బస్సు రావడమే కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్ తీసుకువస్తా. ఏడాది తిరిగేలోగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. ఇక్కడకు పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది.' అని రే...