భారతదేశం, జూలై 7 -- ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు అందానికి, అభినయానికి మారుపేరు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన సమంత అక్కడ డెట్రాయిట్, మిచిగాన్‌లో జరిగిన తానా కార్యక్రమంలో ఎర్రటి చీర, కార్సెట్ బ్లౌజ్‌లో అద్భుతంగా మెరిసిపోయారు. ఆమె స్నేహితురాలు క్రేషా బజాజ్ డిజైన్ చేసిన ఈ ప్రత్యేకమైన దుస్తుల్లో సామ్ కనిపించిన తీరు అక్కడి వారందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలో సమంత ధరించిన చీరకట్టు గురించి మరిన్ని వివరాలు చూద్దాం.

తన అద్భుతమైన లుక్‌కు సంబంధించిన చిత్రాలను పంచుకుంటూ, సమంత "నిన్న సాయంత్రం" అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ చీరను క్రేషా బజాజ్ తన సొంత లేబుల్ కింద డిజైన్ చేయగా, ఆమె హెయిర్ స్టైలింగ్, మేకప్ బాధ్యతలను కన్వాల్ బటూల్ చూసుకున్నారు. కన్వాల్ బటూల్ ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ మెట్ గాలాలో తొలిసారి కనిపించినప్పుడు కూడా స్టైల్ చేశారు. సంప్రదాయ ఆర...