Andhrapradesh, ఆగస్టు 25 -- ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులతో సీఎం సమీక్షించారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత ఏ విధంగా ఉంది, సరఫరా ఎలా జరుగుతోందనే అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.

ఈ సందర్భంగా జిల్లాల్లో ఉన్న పరిస్థితిని అధికారులు వివరించారు. అవసరానికి తగ్గట్టుగానే ఎరువులు, యూరియాను అందుబాటులో ఉంచుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మార్క్ ఫెడ్ ద్వారా ఎంతమేర ఎరువులను సరఫరా చేస్తున్నారని చంద్రబాబు అడిగారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్ ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్క్ ఫె...