భారతదేశం, నవంబర్ 12 -- దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట వద్ద పేలుడుతో పలు నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారు. అయితే తాజాగా దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లోని ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు అందాయి. హైదరాబాద్, దిల్లీ, చెన్నై, ముంబై, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామని బెదిరింపులు అందాయి. ఈ మేరకు బుధవారం ఇండిగో ఎయిర్ లైన్స్ ఆఫీసుకు మెయిల్ వచ్చింది.

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే జాబితాలో హైదరాబాద్ కూడా ఉండటంతో నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. బస్ స్టాప్స్, దేవాలయాలు, షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబ్ స...