భారతదేశం, మే 9 -- పలు సరిహద్దు జిల్లాలపై పాక్ సైన్యం దాడి చేసిన నేపథ్యంలో విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను పెంచిన కారణంగా ప్రయాణికులు మూడు గంటల ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని పిలుపునిస్తూ వాణిజ్య విమానయాన సంస్థలు గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశాయి.

"విమానాశ్రయాల్లో మెరుగైన చర్యలపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, భారతదేశం అంతటా ఉన్న ప్రయాణీకులు ప్రయాణ సమయానికి కనీసం మూడు గంటల ముందుగానే ఆయా విమానాశ్రయాలకు చేరుకోవాలి. బయలుదేరడానికి 75 నిమిషాల ముందు చెక్-ఇన్ మూసివేసి ఉంటుంది..' అని ఎయిర్ లైన్స్ సంస్థలు పేర్కొన్నాయి.

ఈ అసాధారణ సమయంలో అన్ని విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఇండిగో తెలిపింది. 'భద్రతా తనిఖీలు ఫార్మాలిటీలకు అనుగుణంగా మీ ప్రయాణానికి కొంత అదనపు సమయాన్ని అనుమత...