భారతదేశం, ఫిబ్రవరి 16 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండల పెళ్లి గురించిన గుసగుసలు హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్లిద్దరు ఇదే నెలలో మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 15) రాత్రి రష్మిక, విజయ్ ముంబయి ఎయిర్ పోర్ట్ లో కనిపించడం వైరల్ గా మారింది. వీళ్లిద్దరు కలిసి ఒకే కార్లో వెళ్లారు.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తాజాగా ముంబయి వెళ్లారు. అక్కడి ఎయిర్ పోర్ట్ లో వీళ్లు వేర్వేరుగానే కనిపించారు. విడివిడిగానే బయటకు వచ్చారు. రష్మిక బ్రౌన్ టాప్, బ్లాక్ జీన్స్, బూట్లతో సాధారణ దుస్తుల్లో కనిపించింది. ఆమె ఒక పుస్తకం పట్టుకుని, ఫోటోగ్రాఫర్‌లకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ టెర్మినల్ నుంచి బయటకు వెళ్లింది.

విజయ్ దేవరకొండ కూడా అదే సమయంలో ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. అతను బ...