భారతదేశం, జనవరి 29 -- న్యూఢిల్లీ: తన 36 కోట్ల మంది వినియోగదారులకు ఎయిర్‌టెల్ అదిరిపోయే వార్త చెప్పింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్ తో జతకట్టిన ఎయిర్‌టెల్, తన మొబైల్, బ్రాడ్‌బాండ్, డిటిహెచ్ కస్టమర్లకు 'అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం' సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది. సుమారు రూ. 4,000 విలువైన ఈ ప్రీమియం ప్యాకేజీని ఎయిర్‌టెల్ యూజర్లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా, క్రెడిట్ కార్డ్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే పొందవచ్చు.

ఈ ఆఫర్‌ను పొందాలనుకునే వారు తమ ఫోన్‌లోని 'Airtel Thanks App' ద్వారా లాగిన్ అవ్వాలి. మీరు మొబైల్ యూజర్ అయినా, వైఫై వాడుతున్నా లేదా ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కస్టమర్ అయినా ఈ ప్రయోజనం పొందడానికి అర్హులు.

అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంలో సాధారణ ఎడిటింగ్ యాప్స్‌లో దొరకని అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి:

భారతీయ టె...