భారతదేశం, సెప్టెంబర్ 16 -- సైబర్ మోసాల వల్ల కలిగే ఆర్థిక నష్టాల్లో తమ నెట్ వర్క్ పరిధిలో 68.7% తగ్గుదల కనిపించిందని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈ విషయం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నివేదిక ద్వారా స్పష్టమైందని తెలిపింది. ఇది స్పష్టమైందని తెలిపింది. అలాగే మొత్తం సైబర్ క్రైమ్ ఘటనల్లో 14.3% తగ్గుదల నమోదైందని వివరించింది. ఎయిర్‌టెల్ ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని చెప్పింది. 2024 సెప్టెంబర్ నుండి 2025 జూన్ మధ్య కాలంలో ఈ గణాంకాలను పోల్చి చూస్తే ఈ భారీ తగ్గుదల కనిపించింది.

గతేడాది సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్ సంస్థ దేశంలోనే మొట్టమొదటిసారిగా నెట్‌వర్క్ ఆధారిత AI-పవర్డ్ స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్‌ను ప్రారంభించింది. ఈ టెక్నాలజీతో అనుమానాస్పద స్పామ్ కాల్స్, మెసేజ్‌ల గురించి కస్టమర్లకు ...