భారతదేశం, మే 5 -- ీరు కూడా ఎక్కువ వ్యాలిడిటీతో రోజుకు ఎక్కువ డేటా, అపరిమిత కాలింగ్ అందించే మొబైల్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా(విఐ) ప్లాన్లతో రీఛార్జ్ చేయవచ్చు. ఈ మూడు ప్లాన్లలో మీకు ఒకే రకమైన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ధర విషయంలో వ్యత్యాసం ఉంటుంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా 56 రోజుల వాలిడిటీతో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ గురించి చూద్దాం..

ఎయిర్‌టెల్ రూ.649 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 56 రోజుల వాలిడిటీతో వస్తుంది. రోజుకు 2 జీబీ డేటా అంటే మొత్తం 112 జీబీ డేటాను అందిస్తుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా వింక్ మ్యూజిక్, ఉచిత హలోట్యూన్స్, అపోలో 24/7 వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి వినియోగదారు రకం, ప్రాంతంపై ఆధారపడి ఉంట...