భారతదేశం, జూన్ 14 -- ఎయిరిండియా విమానం ఏఐ-717 ప్రమాదానికి గురైన కొన్ని రోజుల తర్వాత అందులోని ప్రయాణికుల విషాద గాథలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి కథే గుజరాత్ లోని హిమాత్ నగర్ కు చెందిన యువతి పాయల్ ఖతిక్ ది. ఆటో డ్రైవర్ కూతురు పాయల్ తొలిసారిగా దేశం విడిచి వెళ్లేందుకు విమానం ఎక్కింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా అహ్మదాబాద్-గాట్విక్ విమానంలోని దురదృష్టవంతులైన 230 మంది ప్రయాణికుల్లో ఆమె ఒకరు.

ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ కోసం యునైటెడ్ కింగ్ డమ్ కు వెళ్లడానికి పాయల్ ఆ విమానం ఎక్కారు. వారి కుటుంబంలో విమానం ఎక్కిన తొలి సభ్యురాలు పాయల్. ఉదయం 10 గంటల సమయంలో తమ ముద్దుల కుమార్తెకు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికి ఇంటికి తిరిగి వెళ్లారు. అయితే, కొన్ని గంటల్లోనే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్ప...