Telangana,hyderabad, జూలై 11 -- తెలంగాణలోని గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ ఇచ్చిన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. రాజాసింగ్ రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారని. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు లేఖ ద్వారా రాజాసింగ్ కు వివరాలను పేర్కొన్నారు.

రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ నాయకత్వం. లేఖలో పేర్కొన్న కారణాలను తోసిపుచ్చింది. లేఖలో పేర్కొన్న అంశాలు అసంబద్ధమైనవిగా అభిప్రాయపడింది. ఫలితంగా ఇకపై రాజాసింగ్ బీజేపీకి పూర్తిస్థాయిలో దూరంగా ఉండనున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్. పార్టీలోని నాయకత్వ విభేదాల కారణంగా జూన్ 30న పార్టీని వీడారు.

బీజేపీ తెలంగాణ శాఖ నూతన అధ్యక్షుడిగా ఎన్ రాంచందర్ రావును నియమిస్తారని మీడియాలో వార్తలు వచ్చిన కొద్దిసేపటికే రాజాస...