భారతదేశం, జూన్ 25 -- ఎమర్జెన్సీ సమయంలో అంతగా తెలియని ఎపిసోడ్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన తీవ్ర విమర్శకుడు, దేశవ్యాప్త ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ చికిత్స కోసం రహస్యంగా రూ.90,000 ఇచ్చారు. అయితే, ఆ డబ్బును నారాయణ్ తిరస్కరించారు. ఈ విషయాన్ని ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఒక కొత్త పుస్తకం వెల్లడించింది.

ఎమర్జెన్సీ సమయంలో కస్టడీలో ఉన్న జేపీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన రెండు మూత్రపిండాలు ఫెయిల్ అయ్యాయి. జీవిత కాలం ఆయన తన ప్రాణాలను కాపాడే పోర్టబుల్ డయాలసిస్ యంత్రం తోడు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సమయంలోనే ఇందిరా గాంధీ ఆ డబ్బును జేపీ చికిత్స కోసం పంపించారు.

ఎమర్జెన్సీ ప్రకటించిన కొద్ది గంటల్లోనే 1975 జూన్ 26న జయప్రకాశ్ నారాయణ్ ను అరెస్ట్ చేశారు. చండీగఢ్ లో ఐదు నెలల పాటు ఆయన కస్టడీలో గడిపారు. అదే ఏడాది నవంబర్ లో 30 ...