Hyderabad, జూలై 11 -- నటి శృతి హాసన్ పెళ్లి, తల్లి కావడంపై స్పందించింది. ఈ మధ్య రణ్‌వీర్ అల్లాబాదియా పాడ్‌కాస్ట్‌లో ప్రేమ, పెళ్లి, మాతృత్వం వంటి అనేక విషయాలపై తన అభిప్రాయాలను పంచుకుంది. తాను ఎప్పుడూ తల్లి కావాలని కోరుకున్నానని, అయితే పెళ్లి అనే ఆలోచన తనను ఎందుకు భయపెడుతుందో ఆమె ఈ సందర్భంగా వెల్లడించింది.

శృతి హాసన్ చాలా కాలంగా తాను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని బహిరంగంగానే చెబుతోంది. ఆమె శాంతను హజారికాతో డేటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఈ నిర్ణయానికి గల కారణాన్ని వివరిస్తూ ఆమె ఇలా చెప్పింది. "పెళ్లి అనే ఆలోచన అంటే నాకు చాలా భయం. ఈ విషయాన్ని చెప్పడానికి నాకు ఎలాంటి భయం లేదు. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను.

నా జీవితంలో నేను నాకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవడానికి చాలా కష్టపడ్డాను. అలాంటిది ఒక కాగితం ముక్...