భారతదేశం, మే 23 -- విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. బాంబు పేలుళ్ల కోసం సిరాజ్‌, సమీర్‌లు పేలుడు పదార్ధాలను సమీకరించారనే సమాచారంతో గత శనివారం వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌లో ఉన్న నిందితుల విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలించారు.

బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన విజయనగరం యువకుడి వ్యవహారంలో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. విశాఖ సెంట్రల్‌ జైలు నుంచి నిందితుల్ని విజయనగరం పోలీస్ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించి విచారిస్తున్నారు. నిందితులకు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు కుట్రలు పన్నారనే అనుమానంతో అరెస్ట్‌ అయిన నిందితులను ప్రశ్నించేందుకు పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతించింది. నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తే బాంబు పేలుళ్ల కుట్రపై స్పష్టత వస్తుందని...